: నల్లధనం విషయంలో క్రెడిట్ అంతా సుప్రీంకోర్టుదే: రాం జెఠ్మలానీ
నల్లధనం ఖాతాదారుల జాబితా ఈ రోజు సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ స్పందించారు. భారత రాజకీయ చరిత్రలో ఇదొక శుభపరిణామమని పేర్కొన్నారు. అయితే, ఈ క్రెడిట్ ఆర్థిక శాఖకు లేదా అటార్ని జనరల్ కు కాకుండా, కేవలం సుప్రీంకోర్టుకే వెళుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఖాతాదారుల పేర్లను సిట్ కు అప్పగించాలని చెప్పారు. ఈ కేసులో విచారణను ప్రభుత్వం లేదా అధికారుల చేతుల్లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని జెఠ్మలానీ సూచించారు.