: 'ఇసిస్' వైపు గూగుల్ మాజీ ఉద్యోగి చూపు: అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులు


గూగుల్ లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలో పనిచేసిన అతడు ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఇసిస్ వైపు ఆకర్షితుడయ్యాడు. ఉద్యోగం మానేసి ఇసిస్ లో చేరేదెలాగంటూ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. అంతేకాక, ఇస్లామిక్ స్టేట్ స్థాపన దిశగా సాగిన అతడి ఆలోచనలు పలువురు యువకులు 'ఇసిస్'పై దృష్టి సారించేందుకు దోహదపడ్డాయి. అయితే పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది. హైదరాబాద్ లోని ముషీరాబాద్ లో నివాసముండే గూగుల్ మాజీ ఉద్యోగి సల్మాన్ కదలికలపై కొంతకాలంగా నిఘా పెట్టిన పోలీసులు చివరకు మంగళవారం రాత్రి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఇసిస్ లో చేరేందుకు అతడు చేసిన యత్నాలను నిర్ధారించుకున్న మీదటే అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని పోలీసులు విచారిస్తున్నారు. విచారణ ముగిస్తే పలు కీలక విషయాలు వెలుగు చూస్తాయని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి.

  • Loading...

More Telugu News