: డీసీసీబీ, డీసీఎంఎస్ ఎన్నికలకు కాంగ్రెస్ ఇన్ ఛార్జులు


ఈనెల 18న 22 జిల్లాలకు జరగనున్న డీసీసీబీ (జిల్లా సహకార కేంద్ర బ్యాంకు), డీసీఎంఎస్ ఎన్నికల కోసం మంత్రులను ఇన్ ఛార్జులుగా నియమిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) ప్రకటన చేసింది. వీటికి పరిశీలకులుగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు జిల్లాపై పట్టున్న నేతలను నియమించినట్లు ప్రకటనలో పేర్కొంది.

కాగా, అభ్యర్ధుల నామినేషన్ల గడువు 15వ తేదీతో ముగుస్తుండడంతో
, ఇప్పటికే పలువురు నేతలు ఈ ఎన్నికల్లో పదవులను తమ వారికే కట్టబెట్టాలంటూ ముఖ్యమంత్రి, బొత్సలతో మంతనాలు చేసిన సంగతి తెల్సిందే.

  • Loading...

More Telugu News