: నిఠారీ హంతకుడు సురేంద్ర కోలీ పిటిషన్ తిరస్కరణ...ఇక ఉరి ఖాయం!
నిఠారీ హత్యల కేసులో హంతకుడు సురేంద్ర కోలీ పిిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిఠారీ హత్యలకు సంబంధించిన ఓ కేసులో అతనికి మరణశిక్ష పడింది. అటు, రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో తనకు విధించిన శిక్షను పునఃపరిశీలించాలంటూ కోలీ సుప్రీంలో పిటిషన్ వేశాడు. సుప్రీం ఏర్పాటు చేసిన ప్రత్యేక ధర్మాసనం ఆ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఇక అతను ఉరికంబం ఎక్కక తప్పదు!