: కొణతాల ఇంకా మా పార్టీ నేతే!: వాసిరెడ్డి పద్మ
కొణతాల రామకృష్ణ ఇంకా తమ పార్టీనేతేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అంటున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ, కొణతాల పార్టీ నుంచి వెళ్లిపోతారన్న విషయాన్ని తాను నమ్మడం లేదని చెప్పారు. 'పార్టీకి కొణతాల రాజీనామా' అని మీడియాలో మాత్రమే తాను చూశానని తెలిపారు. కానీ, దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. పార్టీలో ఆయనకు ఏమైనా ఇబ్బంది ఉంటే టీ కప్పులో తుపానులా సమస్య తీరిపోతుందని పద్మ చెప్పారు.