: ‘రక్తానికి రక్తం’ వ్యాఖ్యలపై బిగ్ బీకి లాస్ ఏంజెలిస్ కోర్టు సమన్లు!


బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు లాస్ ఏంజెలిస్ కోర్టు మంగళవారం సమన్లు జారీ చేసింది. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన సిక్కుల ఊచకోతపై 1984లో స్పందిస్తూ అమితాబ్ చేసిన వ్యాఖ్యలపై ఈ సమన్లు జారీ అయ్యాయి. ‘రక్తానికి రక్తం’ అంటూ నాడు అమితాబ్ బచ్చన్, సిక్కుల ఊచకోతను సమర్థించేలా వ్యాఖ్యలు చేశారు. దీనిపై ‘సిక్స్ ఫర్ జస్టిస్’ అనే అమెరికా మానవ హక్కుల సంస్థ సభ్యుడు గురు పత్వంత్ పన్నున్ దాఖలు చేసిన పిటిషన్ ఆధారంగా లాస్ ఏంజెలిస్ కోర్టు తాజాగా ఈ సమన్లు జారీ చేసింది. ఈ సమన్లకు జవాబిచ్చేందుకు కోర్టు, అమితాబ్ బచ్చన్ కు 21 రోజుల గడువిచ్చింది. నాటి అమితాబ్ వ్యాఖ్యలు అల్లర్లకు ఆజ్యం పోశాయని సిక్కులు ఆరోపిస్తున్నారు.

  • Loading...

More Telugu News