: బీజేపీ అధికార ప్రతినిధిగా సినీనటి జీవిత


ప్రముఖ సినీనటి జీవిత బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రకటించిన కొత్త కార్యవర్గంలో ఆమెకు స్థానం లభించింది. ఎమ్మెల్సీ దిలీప్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు జి.రామకృష్ణారెడ్డి, ఎమ్.ధర్మారావు, కె.సత్యనారాయణ, ఎస్.వెంకటేశ్వరరావులు ఉపాధ్యక్షులుగా నియమితులయ్యారు. వీరితోపాటు విజయలక్ష్మి, బి.వనిత, వెంకటరమణి, ఎస్.మల్లారెడ్డి, నాగూరావు నామాజీలను కూడా ఉపాధ్యక్షులుగా నియమించారు. ప్రధాన కార్యదర్శులుగా టి.ఆచార్య, ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, చింతా రామమూర్తి నియమితులయ్యారు. అధికార ప్రతినిధులుగా జీవిత, మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి పి.పుష్పలీలలతో పాటు పదకొండు మందిని నియమించారు. ఏదేమైనప్పటికీ, దాదాపు అన్ని పార్టీలను చుట్టేసిన రాజశేఖర్, జీవిత దంపతులు చివరకు బీజేపీలో స్థిరపడటం గమనార్హం.

  • Loading...

More Telugu News