: తెనాలి వైద్యుడి అదృశ్యం కేసులో కారు లభ్యం!
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో పనిచేస్తున్న తెనాలి వైద్యుడు కొసరాజు జయచంద్ర అదృశ్యం కేసులో పోలీసులు మంగళవారం కొంతమేర పురోగతి సాధించారు. ఆయన కారును బకింగ్ హామ్ కెనాల్ లో గుర్తించిన పోలీసులు జయచంద్ర కోసం గాలిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పది రోజుల కిందట తెనాలికి బయలుదేరిన ఆయన విజయవాడ చేరిన తర్వాత అదృశ్యమైన సంగతి తెలిసిందే. జయచంద్ర కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన కారును గుర్తించారు. అయితే అందులో జయచంద్ర లేరు. మరోవైపు ఆయన అదృశ్యం కేసులో హత్య కోణం లేదని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రోడ్డుపై జరిగిన ప్రమాదం నేపథ్యంలో ఆయన కారు కెనాల్ లోకి దూసుకెళ్లిందని పోలీసులు చెబుతున్నారు. అయితే కారులో నుంచి ఆయన అదృశ్యం కావడంపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు సాగిస్తున్నారు.