: జమ్మూకాశ్మీర్ లోని 87 స్థానాల్లో బీజేపీ ఒంటరి పోరు!


జమ్మూకాశ్మీర్ లోని 87 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ ఒంటరిగా అభ్యర్థులను నిలబెడుతుందని బీజేపీ ఎంపీ, ఆ రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జి అవినాష్ రాయ్ ఖన్నా తెలిపారు. మహారాష్ట్ర, హర్యానాల్లో విజయం సాధించిన బీజేపీ జమ్మూకాశ్మీర్లో కూడా విజయ ఢంకా మోగిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పోటీ చేయనున్న అభ్యర్థుల తొలి జాబితాను త్వరలోనే విడుదల చేస్తామని ఆయన వివరించారు. అధికారం చేపట్టేందుకు అవసరమైన మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువ సీట్లనే బీజేపీ గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News