: బిగి కౌగిలింతలు, ముద్దులతో ప్రేమికుల నిరసన!
మోరల్ పోలీసింగ్ పేరిట కేరళలోని కోజికోడ్ లో చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న యువమోర్చా కార్యకర్తల తీరుకు ప్రేమికులు నవంబర్ 2న వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయనున్నారు. అక్టోబర్ 23న అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, కోజికోడ్ లోని ఓ రెస్టారెంట్ పై యువ మోర్చా కార్యకర్తలు అక్కడున్న ప్రేమికులపై దాడికి దిగారు. ఈ ఘటనలో శిక్షించడానికి మీకే అధికారముందంటూ పోలీసులు యువ మోర్చా కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత ప్రేమికులు నవంబర్ 2న యువ మోర్చా కార్యకర్తల తీరుపై బిగి కౌగిలింతలు, ముద్దులతో నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. అంతటితో ఆగకుండా ఈ కార్యక్రమంలో ఇతర ప్రేమికులు కూడా తమతో కలసి రావాలని వారు కోరుతున్నారు. అందుకోసం ఫేస్ బుక్ లో ఓ పేజ్ ను కూడా ప్రారంభించారు. దీనిపై పలువురు మేధావులు మండిపడుతున్నారు. ఎవరిపై కోపంతో ఏం చేస్తున్నారో తెలుసుకోవాలని సూచిస్తున్నారు. బహిరంగంగా ముద్దులు, కౌగిలింతలు పెట్టుకోవడం అన్నది ఎక్కడిదాకా తీసుకెళ్తుందో...తల్లిదండ్రుల్లో ఈ చర్యలు ఎంత ఆందోళన రేపుతాయో ఆలోచించాలని వారు ఇస్తున్నారు.