: చెట్టును ఢీ కొని, మూడు ముక్కలైన బీఎండబ్ల్యూ కారు!


ఎంత ఖరీదైన కారైనా అతివేగం ప్రమాదకరం. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ, పరిమితికి మించిన వేగంతో యువకులు ప్రమాదాల బారినపడుతున్నారు. పంజాబ్ రాష్ట్రంలోని లూధియానాలోని సారభనగర్ రోడ్డుపై అత్యంత వేగంతో ప్రయాణిస్తూ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొన్న బీఎండబ్ల్యూ కారు మూడు ముక్కలైందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ సంఘటనలో 25-27 ఏళ్ల మధ్య వయస్కులు ఇద్దరు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News