: వైఎస్ ఫొటో తొలగించారని వైకాపా ఎమ్మెల్యేల ఆందోళన
తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను తొలగించడంపై వైకాపా నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. వైకాపా తిరుపతి ఎంపీ వరప్రసాద్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నారాయణస్వామిలతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. తుడా కార్యాలయం ఎదుట బైఠాయించారు. మరోవైపు, గత ముఖ్యమంత్రుల ఫొటోలను తొలగించి, ప్రస్తుత సీఎంల ఫొటోలను కార్యాలయాల్లో ఉంచడం ఆనవాయతీ అన్న సంగతి వైకాపా నేతలకు తెలియదా? అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు.