: సుప్రీంకోర్టుకు ముగ్గురు నల్లధనం ఖాతాదారుల పేర్లు
నల్లధనం ఖాతాదారులకు సంబంధించిన వివరాలతో సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో అక్రమంగా సంపాదించిన ధనాన్ని స్విస్ బ్యాంకులో దాచుకున్న ముగ్గురి నల్లకుబేరుల పేర్లు వెల్లడించింది. డాబర్ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రదీప్ బర్మన్, రాజ్ కోట్ కు చెందిన పారిశ్రామిక వేత్త పంకజ్ చిమన్ లాల్, గోవాకు చెందిన గనుల యజమాని రాధా ఎస్ టింబ్లోల పేర్లను కేంద్రం తెలిపింది.