: నేడు తెలుగు రాష్ట్రాల విద్యా మంత్రుల భేటీ!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యా శాఖ మంత్రులు గంటా శ్రీనివాసరావు, జగదీశ్వర్ రెడ్డిలు నేడు భేటీ కానున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య విద్యా సంస్థల విభజనపై ఈ సందర్భంగా వీరు చర్చలు జరపనున్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్ లో పేర్కొన్న అంశాలపై దృష్టి సారించనున్న ఇద్దరు మంత్రులు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ బోర్డు విభజనపైనా విద్యా మంత్రులు చర్చించే అవకాశాలున్నాయి. నేటి సాయంత్రం 4 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో జరిగే ఈ భేటీలో ఇరు రాష్ట్రాలకు చెందిన విద్యా శాఖ ఉన్నతాధికారులు కూడా పాలు పంచుకోనున్నారు.