: హృతిక్ రోషన్ ను అభినందించిన మోదీ
ప్రముఖ బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాలుపంచుకుని ఆయన ఎంతో మందిలో స్పూర్తిని రగిలించారని, హృతిక్ చేసిన ఈ పని నుంచి ఆయన అభిమానులంతా స్పూర్తిని పొంది ఉంటారని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జూహూలోని తన నివాసం సమీపంలోని వీధుల్లో శుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హృతిక్ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా చాలా నేర్చుకున్నానని ట్వీట్ చేశారు. దేశాన్ని, నగరాన్ని, వీధులను, నివాసంలో శుభ్రం చేసుకోవడంలో ఉన్న ఆనందం చూశాక మంచి నిర్ణయం తీసుకున్నానని ఆయన ట్విట్టర్లో తెలిపారు.