: తమిళనాట అభిమానానికి పరాకాష్ట... విజయ్ కి విగ్రహం


తమిళనాట సినీ అభిమానానికి అంతు ఉండదని చెప్పేందుకు ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. తాజాగా మరోసారి తమ అభిమానం ఏ స్థాయిలో ఉంటుందో తమిళులు చూపించారు. అభిమానులు 'ఇళయదళపతి' విజయ్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అతనిపై తమ మక్కువను ప్రదర్శించారు. వెట్రీ ధియేటర్ లో హీరో విజయ్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. 1.5 లక్షల రూపాయలతో ఈ విగ్రహాన్ని ఫేస్బుక్ విజయ్ ఫ్యాన్స్ క్లబ్ తయారు చేయించింది. కాగా, ఈ నెల 22న విడుదలైన విజయ్ కొత్త సినిమా 'కత్తి' 30 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ కు జోడీగా సమంత నటించింది. గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ లో వచ్చిన తుపాకీ కూడా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News