: టీచర్ సాహసం చాలా మందిని కాపాడింది


మనకి అత్యంత సమీపంలో కాల్పులు జరుగుతున్నాయనుకోండి, అప్పుడు సాధారణంగా మనం ఏం చేస్తాం? ముందు సురక్షిత ప్రాంతాలకు పారిపోతాం. అదీ కుదరదనుకుంటే చేతులెత్తి సరెండరైపోతాం. అంతే కానీ తుపాకీ కాల్చుతున్న వ్యక్తికి ఎదురెళ్లి అతన్ని ఆపే ప్రయత్నం చేయం. అలాంటి పని చేసి ఓ టీచర్ అందరి మనసులు గెలుచుకున్నారు. శుక్రవారం అమెరికాలోని సియాటెల్ నగరంలోని ఓ ఉన్నత పాఠశాలలో విద్యార్థి జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, నలుగురు గాయపడిన సంగతి తెలిసిందే. అదే పాఠశాలలో కొత్తగా చేరిన టీచర్ మెగాన్ సిల్ బెర్గర్ ధైర్యంగా ముందుకు ఉరికి అతనిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. లేకుంటే మరింత మందిని అతను పొట్టనబెట్టుకునేవాడని ప్రత్యక్షసాక్షులు, పాఠశాల సిబ్బంది తెలిపారు. మెగాన్ చేసిన సాహసాన్ని పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు కొనియాడారు.

  • Loading...

More Telugu News