: హర్యానా సీఎంగా ఖట్టర్ ప్రమాణం


హర్యానా ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ ప్రమాణం చేశారు. హర్యానాలోని పంచకులలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ ఉదయం 11.22 గంటలకు హర్యానా గవర్నర్ కప్తాన్ సింగ్ సోలంకీ, ఖట్టర్ తో ప్రమాణం చేయించారు. తద్వారా హర్యానాకు తొలి బీజేపీ సీఎంగా ఖట్టర్ రికార్డులకెక్కారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ వృద్ధ నేత ఎల్కే అద్వానీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్ తో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News