: టైటిల్ కు అడుగు దూరంలో సానియా జోడీ
మహిళల టెన్నిస్ సీజన్ ముగింపు టోర్నమెంట్ డబ్ల్యూటీఏ ఫైనల్స్ లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, కారా బ్లాంక్ (జింబాబ్వే) జోడీ 4-6, 7-5, 11-9 స్కోరుతో క్వెటా పెశెక్ (చెక్ రిపబ్లిక్), స్రెబోట్నిక్ (స్లోవేకియా)పై విజయం సాధించారు. రెండు గంటల పాటు జరిగిన పోరులో సానియా జోడీ సూపర్ టై బ్రేక్ మ్యాచ్ ను వశం చేసుకుంది. సానియా జంట ఫైనల్లో సువీహ్సీ (చైనీస్ తైపీ), ష్వాయ్ పెంగ్ (చైనా) తో తలపడనుంది.