: రిలయన్స్ ఆసుపత్రి దేశానికి అంకితం


ముంబయిలో హెచ్ ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 350 పడకలు గలిగిన ఈ ఆసుపత్రిలో పూర్తి స్థాయి అత్యాధునిక వైద్యసదుపాయాలు అందించనున్నారు. ఈ ఆసుపత్రిని ముంబైతో పాటు దేశంలోని పేద ప్రజల కోసం నిర్మించామని నిర్వాహకులు తెలిపారు. ఈ ఆసుపత్రిలో హృద్రోగ, న్యూరో, ఆంకాలజీ తదితర విభాగాల్లో అత్యున్నత సేవలు అందిస్తామని రిలయన్స్ సంస్థ తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు సహా ముఖేష్ అంబానీ కుటుంబం, పలువురు పారిశ్రామిక, సినీ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News