: నవంబర్ 25 నుంచి జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ లో ఎన్నికలు


జమ్మూకాశ్మీర్, జార్ఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ను ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్ విడుదల చేశారు. జమ్మూకాశ్మీర్ లో 87, జార్ఖండ్ లో 81 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాల్లో నవంబర్ 25 నుంచి ఎన్నికలు ప్రారంభమవుతాయని కమిషనర్ తెలిపారు. అంతేగాక, ఢిల్లీలోని మూడు నియోజకవర్గాలకు కూడా ఇదే సమయంలో ఉపఎన్నికలు జరుగుతాయని వివరించారు. రెండు రాష్ట్రాల్లోనూ 'నోటా'కు అవకాశం ఉంటుందని సంపత్ వెల్లడించారు. మొత్తం ఐదు దశల్లో ఈ రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలు నవంబర్ 25న, రెండో దశ ఎన్నికలు డిసెంబర్ 2, మూడోదశ ఎన్నికలు 9న, నాలుగోదశ ఎన్నికలు 14న, ఐదోదశ ఎన్నికలు 20న జరుగుతాయి. డిసెంబర్ 23న రెండు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

  • Loading...

More Telugu News