: కేసీఆర్ కి ఆ జీవోలు అర్థం కాలేదు: పరకాల
కేసీఆర్ మాటలు మీరుతున్నారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ విపరీత బుద్ధి ప్రదర్శిస్తున్నారని అన్నారు. అసలు కేసీఆర్ కు 69, 107 జీవోలు అర్థం కాలేదని అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారని ప్రభాకర్ విమర్శించారు. ఆ రెండు జీవోలను పాటిస్తామని రెండు రాష్ట్రాలు కృష్ణా బోర్డు వద్ద ఒప్పుకున్నాయని ఆయన చెప్పారు. కేవలం తెలుగు ప్రజలను తప్పుదోవపట్టించేందుకే కేసీఆర్ సవాళ్లు విసురుతున్నారని ఆయన స్పష్టం చేశారు.