: రాష్ట్రానికి నిధులు తెమ్మన్నారు: ఎంపీ హరిబాబు
ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాదులో భేటీ అనంతరం ఎంపీ హరిబాబు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన సందర్భంగా బిల్లులో పేర్కొన్న నిధులన్నీ విడుదల చేయాని కేంద్రంపై ఒత్తిడి చేయాలని బాబు కోరారని అన్నారు. హుదూద్ తుపాను నష్ట పరిహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని కోరాలని సూచించారని ఆయన వెల్లడించారు. స్మార్ట్ సిటీగా విశాఖను పునర్నిర్మించడానికి అవసరమైన నిధులపై ఆరాతీయాలని బాబు చెప్పారని తెలిపారు. ఢిల్లీ వెళ్లి ప్రధాని, కేంద్ర మంత్రులను కలసి రాష్ట్రానికి అవసరమైన ఆర్ధిక సాయం తీసుకురావాలని సీఎం సూచించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో ముఖ్యమంత్రికి అన్ని విధాలా సహకరిస్తామని ఎంపీలు తెలిపారు.