: జయలలిత 'రూపాయి ఇడ్లీ' సూపర్ హిట్


తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తాజాగా చెన్నై అల్పాదాయ వర్గాల కోసం ప్రారంభించిన 'రూపాయికే ఇడ్లీ' పథకం విజయవంతమైంది. బలహీన వర్గాలకు చవకగా పోషకాహారం అందించే లక్ష్యంతో జయలలిత సర్కారు చెన్నై వ్యాప్తంగా ఈ బడ్జెట్ క్యాంటీన్లను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రజలకు అందుబాటులోకొచ్చిన ఈ క్యాంటీన్లు ఇప్పుడు కిటకిటలాడుతున్నాయి. ఒక్కరోజే 2 లక్షల ఇడ్లీలు అమ్ముడయ్యాయంటేనే ఈ పథకం ఎంతలా ప్రజాదరణ పొందిందో అర్థం చేసుకోవచ్చు.

ఇక మధ్యాహ్నం వేళల్లో కూడా ఈ క్యాంటీన్ల వద్ద విపరీతమైన రద్దీ చోటు చేసుకుంటోంది. మధ్యాహ్న వేళల్లో ఇక్కడ రూ. 5కే సాంబారన్నం అందిస్తారు. అయితే ఆశ్చర్యకరంగా ఈ చవక ఆహారం కోసం క్యూలు కట్టేవారిలో అన్ని వర్గాలవారు ఉంటున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, ఎగువ మధ్యతరగతి వర్గాలు కూడా ఈ రూపాయి ఇడ్లీ కోసం ఎగబడుతున్నారని క్యాంటీన్ల నిర్వాహకులు అంటున్నారు. ఏఐడీఎంకే ప్రభుత్వం ఈ బడ్జెట్ క్యాంటీన్ల నిర్వహణను స్వయం సహాయక సంఘాలకు అప్పగించింది.

  • Loading...

More Telugu News