: ఎబోలాపై ప్రజల్లో భయాందోళనలు తొలగించేందుకు ఒబామా ఏంచేశారో చూడండి!
ఎబోలా వ్యాధిపై అమెరికా ప్రజల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించడానికి అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా రంగంలోకి దిగారు. ఎబోలా మహమ్మారి బారినపడి కోలుకున్న నర్సు నినా ఫమ్ ను ఓవల్ ఆఫీసులో కలిశారు. త్వరగా కోలుకోవడం పట్ల అభినందిస్తూ, ఆమెను హత్తుకుని అమెరికన్లలో ఏర్పడిన అపోహలను పారదోలే ప్రయత్నం చేశారు. ఈ వార్తకు అమెరికా మీడియా విశేష ప్రాచుర్యం కల్పించింది. డల్లాస్ లోని ఓ ఆసుపత్రిలో లైబీరియాకు చెందిన ఎబోలా రోగికి చికిత్స అందిస్తుండగా, వ్యాధి నినాకు కూడా సోకింది. దీంతో, మేరీలాండ్ లోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) లో ఆమెకు చికిత్స చేశారు. శుక్రవారం నాడు ఆమె డిశ్చార్జ్ అయింది.