: రాజధాని కోసం భూములిచ్చేవారికి లాభం చేకూరుస్తాం: మంత్రి నారాయణ


నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని కోసం భూములిచ్చే వారికి లాభం చేకూర్చేలా చర్యలు తీసుకుంటామని ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ పునరుద్ఘాటించారు. శనివారం రాజధాని సలహా కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కొత్త రాజధాని కోసం భూ సేకరణకు సంబంధించి విధివిధానాలను రూపొందించామని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తర్వాత వాటిని వెల్లడి చేస్తామని ఆయన తెలిపారు. దేశంలో కొత్త రాజధాని నయా రాయ్ పూర్ తరహాలోనే భూసేకరణను చేపట్టనున్నామన్నారు. రాజధాని కోసం భూములిచ్చేవారికి ఏ విధంగానూ నష్టం జరగనివ్వబోమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News