: మోదీని చెడుగా చిత్రీకరించేందుకు జైట్లీ యత్నం: రాం జెఠ్మలాని


కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీపై కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలాని విరుచుకుపడ్డారు. నల్లధనం విషయంలో జైట్లీ తీరు దేశ ప్రయోజనాలకు తీరని విఘాతం కలిగిస్తుందని అన్నారు. ద్వైపాక్షిక ఒప్పందాల వల్ల నల్ల కుబేరుల జాబితాను వెల్లడించలేమని జైట్లీ అంటున్నారని... ఆయన వ్యాఖ్యలతో ప్రధాని మోదీకి చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ప్రధాని పీఠంపై జైట్లీ కన్నేశారని... అందుకే ఇలా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. మృత్యువు అంచుల వరకు వెళ్లి వచ్చిన జైట్లీ... ఇలా ఎందుకు చేస్తున్నారని అన్నారు.

  • Loading...

More Telugu News