: 'నయా పాకిస్థాన్'లో పెళ్లి చేసుకుంటానంటున్న ఇమ్రాన్ ఖాన్
పాప్యులర్ క్రికెటర్ నుంచి పూర్తిస్థాయి రాజకీయ నేతగా మారిన ఇమ్రాన్ ఖాన్... తన 'నయా పాకిస్థాన్' కల నెరవేరిన తరువాతే వివాహం చేసుకుంటానని అంటున్నారు. ఈ మేరకు తన తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న సందర్భంగా పైవిధంగా తెలిపాడు. వేలమంది పార్టీ మద్దతుదారుల సమక్షంలో మాట్లాడుతూ, "మీ అందరి కోసం కాకుండా నాకోసం కూడా కొత్త పాకిస్థాన్ ను సృష్టించాలనుకుంటున్నా. ఎందుకంటే, నయా పాక్ కల నిజమైనప్పుడే నా పెళ్లి జరుగుతుంది" అని అరవై రెండేళ్ల ఖాన్ ఉత్సాహంగా చెప్పారు. అంతేకాదు ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలని ఇమ్రాన్ డిమాండ్ చేశారు.