: కేంద్రానికి నివేదిక కూడా పంపలేని దుస్థితిలో కేసీఆర్ ఉన్నారు: నాగం
రైతుల సమస్యలను గాలికి వదిలి... రాజకీయాలు చేయడంలో టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీగా ఉన్నారని బీజేపీ నేత నాగం జనార్ధనరెడ్డి మండిపడ్డారు. తన అసమర్థతతో కరెంటు సంక్షోభానికి కారణమైన కేసీఆర్ కు రైతుల ఉసురు తగిలి తీరుతుందని అన్నారు. గత నలభై ఏళ్లలో ఎన్నడూ రానంత కరవు తెలంగాణలో సంభవిస్తే... కనీసం కేంద్రానికి నివేదిక పంపలేని దుస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలను పట్టించుకోవాలని... లేకపోతే టీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.