: అమృత్ సర్ లో రెండు సిక్కు గ్రూపుల మధ్య కాల్పులు


అమృత్ సర్ లో రెండు సిక్కు గ్రూపుల మధ్య తలెత్తిన ఘర్షణ చివరకు కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో ఓ బాలుడు సహా ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే, అమృత్ సర్ లోని ఓ గురుద్వారా స్థలంపై రెండు సిక్కు గ్రూపుల మధ్య వివాదం నడుస్తోంది. ఈ రోజు సిక్కులు సంప్రదాయబద్ధంగా జరుపుకునే ఆయుధాల ప్రదర్శన సమయంలో ఘర్షణ మొదలైంది. తొలుత రెండు వర్గాలు శాంతియుతంగానే ఉన్నప్పటికీ... కొద్ది సమయంలోనే అది నాటు తుపాకులతో కాల్పులు జరుపుకునేంత వరకు వెళ్లింది. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో... పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News