: మోదీకి లేఖ రాసిన జగన్
ప్రధాని మోదీకి వైకాపా అధినేత జగన్ లేఖ రాసినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. శ్రీశైలం జల వివాదానికి సంబంధించి ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని లేఖలో కోరినట్టు వెల్లడించారు. రాయలసీమ తీవ్ర నీటి ఎద్దడిలో ఉందని... కనీసం తాగునీరు కూడా దొరకని పరిస్థితిలో ఉందని ప్రధానికి జగన్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజా సమస్యలు పట్టడం లేదని... రియలెస్టేట్ వ్యాపారం, సొంత ప్రయోజనాలు తప్ప... ప్రజల గురించి ఆలోచించడం లేదని లేఖలో ఆరోపించారు.