: తెలంగాణ దుస్థితికి కాంగ్రెస్, టీడీపీలే కారణం: కేటీఆర్


తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న ప్రస్తుత దుస్థితికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని టీఆర్ఎస్ ముఖ్యనేత, తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, రైతులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై చర్చకు తమ ప్రభుత్వం సిద్ధంగానే ఉందని శుక్రవారం అన్నారు. సమస్యలకు బాధ్యులెవరన్న అంశంపై రానున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని ఆయన వెల్లడించారు. ఆరోపణలు గుప్పించి తీరా చర్చకొచ్చేసరికి తప్పించుకునేందుకు యత్నించే వారిని వదిలే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా ప్రతిపక్షాలను హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని అంశాలను నెరవేర్చేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. జటిల సమస్యగా మారిన విద్యుత్ కోతలను నివారించేందుకు అందుబాటులో ఉన్న అన్ని ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News