: విశాఖ ప్రజల స్ఫూర్తికి హేట్సాఫ్: మంత్రి నారాయణ
తుపాను సహాయక చర్యలు కొనసాగుతున్నందున దీపావళి నాడు బాణాసంచా కాల్చొద్దన్న తమ సూచనను విశాఖ ప్రజలు వందశాతం పాటించారని మంత్రి నారాయణ కితాబిచ్చారు. ఒక్కరు కూడా బాణాసంచా కాల్చినట్టు తమ దృష్టికి రాలేదని అన్నారు. విశాఖ ప్రజల స్ఫూర్తికి హేట్సాఫ్ అన్నారు. సహకరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ప్రజలు క్రమశిక్షణ కలిగినవారని కొనియాడారు.