: ఆన్ లైన్ కొనుగోలుదారుల్లో హైదరాబాదీలదే అగ్రాసనమట!
ఆన్ లైన్ విక్రయాలు, భారత రిటైల్ రంగం పాటిట అశనిపాతంలా పరిణమించాయి. అయితే, ఈ తరహా కొనుగోళ్లలో దేశంలో హైదరాబాదీలే అగ్రగాములుగా ఉన్నారట. ఈ-కామర్స్ సైట్ల ద్వారా కొనుగోళ్లు చేస్తున్న వారిలో హైదరాబాద్ కు చెందిన వారే అధికంగా ఉన్నారని ఇటీవలి అసోచామ్ సర్వే వెల్లడించింది. నచ్చిన వస్తువులను ఇంట్లో కూర్చునే కొనుగోలు చేయడం సౌకర్యవంతంగా ఉన్నందునే హైదరాబాదీలు ఈ-కామర్స్ సంస్థల బాట పడుతున్నారని ఆ సర్వే వెల్లడించింది.