: బరువు తగ్గండి... గిఫ్ట్ అందుకోండి: యూకే సర్కారు కొత్త నినాదం
బ్రిటన్ లోని ఉద్యోగుల్లో అత్యధికులు అధిక బరువుతో బాధపడుతుండడం పట్ల అక్కడి సర్కారు దృష్టి సారించింది. బరువు తగ్గితే బహుమతులిస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బరువు తగ్గిన ఉద్యోగులకు గిఫ్ట్ వోచర్లు, క్యాష్ ప్రైజులు, ఇతర బహుమతులు ఇస్తారు. ఈ పథకం ద్వారా యూకేలో 50 శాతం మంది ఉద్యోగులు బరువు తగ్గొచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోనూ ఇలాంటి ఆఫర్ నడుస్తోంది. అటు, పలు సంస్థలు కూడా తమ ఉద్యోగుల బరువుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బరువు తగ్గితే కానుకలిస్తామంటూ ఊరిస్తున్నాయి.