: జమ్మూ కాశ్మీర్ కు రూ. 745 కోట్ల స్పెషల్ ప్యాకేజీ: ప్రధాని మోదీ ప్రకటన
ఇటీవల వరదల ప్రభావానికి అతలాకుతలమైన జమ్మూ కాశ్మీర్ కు కేంద్రం రూ.745 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. దీపావళి పండుగను పురస్కరించుకుని జమ్మూ కాశ్మీర్ లో పర్యటించిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ మేరకు ప్రకటించారు. ఈ నిధులతో, వరదలకు కూలిపోయిన ఇళ్ల పునర్నిర్మాణంతో పాటు ఆరు ఆస్పత్రులను అభివృద్ధి చేయనున్నారు. వరదల కారణంగా పలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితులు మునుపెన్నడూ లేని విధంగా దిగజారిన సంగతి తెలిసిందే.