: జూడాల దీక్ష భగ్నం... అరెస్టులు... సొంతపూచీకత్తులపై విడుదల
హైదరాబాదులో గత 25 రోజులుగా కొనసాగుతున్న జూడా(జూనియర్ డాక్టర్లు)ల దీక్షను పోలీసులు భగ్నం చేశారు. దీక్షా శిబిరాన్ని తొలగించారు. అనంతరం, 30 మంది జూడాలను అదుపులోకి తీసుకుని, సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ తర్వాత సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ప్రస్తుతం, మరోసారి ఉస్మానియా ఆసుపత్రిలో దీక్ష చేయడానికి జూడాలు సిద్ధమవుతున్నారు. అయితే, ఉస్మానియా ఆసుపత్రి ఆవరణలో ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు.