: చంద్రబాబు నిజమైన ప్రజా సేవకుడు: వెంకయ్యనాయుడు


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిజమైన ప్రజా సేవకుడని సాక్షాత్తు ప్రధాని నరేంద్ర మోదీ కీర్తించారని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. విశాఖ ఆర్కే బీచ్ లో జరుగుతున్న ఆత్మవిశ్వాస ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రజల గుండె నిబ్బరాన్ని పొగిడారు. హుదూద్ తుపాను కారణంగా సర్వం కోల్పోయిన విశాఖ వాసులకు త్వరితగతిన సహాయక చర్యలు అందించే క్రమంలో చంద్రబాబు రేయింబవళ్లు పనిచేసిన వైనం ఫ్రధానిని ఆకట్టుకుందని ఆయన తెలిపారు. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రతి ప్రాంతానికి పునర్వైభవం తీసుకొచ్చేదాకా అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News