: 26న ఎన్డీఏ ఎంపీలకు మోదీ తేనీటి విందు
ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ ఎంపీలతో పాటుగా నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ)లోని మిత్రపక్షాల ఎంపీలకు ఈ నెల 26న తేనీటి విందు ఇవ్వనున్నారు. ఇటీవల తన కేబినెట్ సహచరులకు విందు ఏర్పాటు చేసిన మోదీ, దాని ద్వారా ఆశించిన పలితాన్నే సాధించినట్లున్నారు. సదరు విందు ముగిసిన వెంటనే ఎంపీలతోనూ విందుకు ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల బీజేపీతో విభేదించిన శివసేన కూడా ఎన్డీఏలో మిత్రపక్షమే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీలు కూడా ఈ విందుకు హాజరుకానున్నట్లు విశ్వసనీయ సమాచారం.