: మీరే బ్లఫ్ మాస్టర్లు: జైట్లీపై కాంగ్రెస్ విసుర్లు


నల్లధనం వ్యవహారంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీపై బుధవారం కాంగ్రెస్ పార్టీ విరుచుకుపడింది. నల్లధనం వివరాల వెల్లడిలో భయపడుతున్నది తాము కాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ అన్నారు. అంతేగాక, ఇందులో ప్రజలను మభ్యపెడుతూ నరేంద్ర మోదీ సర్కారు 'బ్లఫ్ మాస్టర్' గా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. నల్ల కుబేరుల జాబితాను వెల్లడి చేయమని డిమాండ్ చేస్తున్న తమపై ఆరోపణలకు దిగడం బీజేపీ నేతలకే చెల్లిందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. నల్ల కుబేరుల వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వం వెల్లడించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ‘మోసగాడు మోసగాడే. అది బీజేపీ నేతైనా కావచ్చు. కాంగ్రెస్ వ్యక్తి అయినా కావచ్చు. మరి వారి పేర్లను జైట్లీ ఎందుకు వెల్లడించండం లేదు’ అంటూ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతావా, ట్విట్టర్లో బీజేపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

  • Loading...

More Telugu News