: చైనా సరిహద్దు వెంబడి రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం
చైనా సరిహద్దు వెంబడి నిర్మించ తలపెట్టిన నాలుగు ప్రధాన రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. కొన్నేళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టుకు తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ హయాంలోని ప్రభుత్వం ఆమోదం తెలపడం విశేషం. ఈ మేరకు గతవారం ప్రణాళికా సంఘం అధికారులు, రక్షణ శాఖ, రైల్వే, ఆర్థిక మంత్రిత్వ శాఖలు కలసి ఓ అత్యున్నత స్థాయి సమావేశం జరిపాయి. ఈ మేరకు చర్చించగా ఓకే చెప్పిన ప్రధానమంత్రి కార్యాలయం, రక్షణ మంత్రిత్వ శాఖ గుర్తించిన వెయ్యి కిలో మీటర్ల వరకు వివరణాత్మక ఇంజనీరింగ్ సర్వే చేపట్టాలని రైల్వేను కోరింది. ఇందుకు వచ్చే నెల వరకు పీఎంవో సమయం ఇచ్చింది. వ్యయానికి సంబంధించిన వివరాలతో సహా సంపూర్ణ అధ్యయన నివేదికతో రావాలని తెలిపింది. ఈ క్రమంలో అరుణాచల్ ప్రదేశ్, అసోం, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్ ప్రాంతాల్లో సర్వే జరగనుంది.