: ఫరీదాబాద్ బాణాసంచా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం... పరుగులు తీసిన ప్రజలు


హర్యానాలోని ఫరీదాబాద్ పట్టణంలో ఓ బాణాసంచా మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఓ షాపులో మొదలైన మంటలు 200 దుకాణాలకు వ్యాపించాయి. ఈ ఘటనలో ఇద్దరు గాయపడ్డారు. పార్కింగ్ స్థలంలో నిలిపి ఉంచిన పలు కార్లు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News