: టీఆర్ఎస్ భవన్ భూస్థాపితం అవుతుంది, జాగ్రత్త!: రేవంత్ రెడ్డి హెచ్చరిక
నల్గొండ జిల్లాలో టీడీపీ కార్యాలయంపై టీఆర్ఎస్ శ్రేణులు దాడి చేయడంపై టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎస్ భవన్ ను భూస్థాపితం చేస్తారని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. రైతు సమస్యలను పరిష్కరించడం చేతగాకే... ప్రజలను పక్కదారి పట్టించేందుకు టీడీపీపై టీఆర్ఎస్ దాడి చేస్తోందని మండి పడ్డారు. తెలంగాణకు 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తామని ఏపీ మంత్రి దేవినేని ఉమ ప్రతిపాదిస్తే... ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం స్పందించలేదని ఆరోపించారు. ఇంత చేతగాని ప్రభుత్వాన్ని తాను ఇంతవరకు చూడలేదని రేవంత్ ఎద్దేవా చేశారు.