: తాగుబోతు సీఎం నిర్ణయాలతో... ప్రజలు కష్టాలపాలవుతున్నారు: ఎర్రబెల్లి ఫైర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీటీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. తాగుబోతైన ముఖ్యమంత్రి నిర్ణయాలతో తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని మండిపడ్డారు. కేసీఆర్ తన చేష్టలతో ప్రజలను తీవ్ర కష్టాలకు గురి చేస్తున్నాడని విమర్శించారు. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఉరికించి కొట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణలో కరెంటు కష్టాలకు చంద్రబాబే కారణమని నిరూపిస్తే... హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు ముక్కును నేలకు రాస్తానని ఛాలెంజ్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పారు.