: దీపావళి తర్వాతే మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు
మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ మరికొంత సమయం తీసుకుంటోంది. దీపావళి తరువాతే ఇక్కడ కొత్త గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనుకుంటోంది. ఇప్పటికే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ), శివసేన లతో చర్చలు జరిపినప్పటికీ బీజేపీ ఏదీ నిర్ణయించుకోలేదు. ఈ క్రమంలో ఈరోజు తాను మహారాష్ట్ర వెళ్లడంలేదని ఆ రాష్ట్ర ఎన్నికల పర్యవేక్షకుడు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. దీపావళి తరువాతే వెళతానని చెప్పారు. పార్టీ సీనియర్ నేత జేపీ నద్దాతో కలసి రాజ్ నాథ్ వాస్తవానికి నేడు ముంబయి వెళ్లి అక్కడ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవాల్సి ఉంది.