: ప్రజల ప్రాణాలు కాపాడుతున్న పోలీసులే గొప్పవారు: చంద్రబాబు


సరిహద్దులో కాపలా కాస్తున్న సైనికుల కంటే సమాజంలో ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్న పోలీసులే గొప్పవారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. మంగళవారం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ, సమాజంలో ప్రజల మాన, ప్రాణాలను కాపాడుతున్న పోలీసుల గౌరవం పెంచేలా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. సంఘ విద్రోహ శక్తులకు ఎదురొడ్డి పోరాడుతున్న పోలీసులు, ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం చినరాజప్ప, డీజీపీ రాముడు, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News