: సర్కారీ ప్రసార మాధ్యమాలకు మోడీ దన్ను!


సర్కారీ ప్రసార మాధ్యమాలు దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోలకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా ప్రధాని నరేంద్ర మోడీ చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా తన కార్యక్రమాలు, ఇంటర్వ్యూల కోసం ఆయన దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియోల వైపే మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే ఈ దిశగా చర్యలు ప్రారంభించిన మోడీ, రానున్న కాలంలో ఈ రెండు ప్రసార మాధ్యమాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. తద్వారా ఆ రెండింటికి వెన్నుదన్నుగా నిలవడంతో పాటు పలు ప్రైవేట్ మీడియా సంస్థలకు చెందిన పాత్రికేయుల నుంచి కఠిన ప్రశ్నలను తప్పించుకోనున్నారు! అయితే మోడీ చర్య, తమను నిర్లక్ష్యం చేస్తున్నట్టుగా ఉందని ప్రైవేట్ చానళ్ల యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్రంగా స్పందించారు. ‘ప్రధాని మోడీ ఏ ఒక్క ఛానల్ నూ నిషేధించలేదు. అన్ని ఛానెళ్లు ఆయన కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. ఇక వివక్ష ఎక్కడుంది? అయినా సర్కారీ ప్రసార మాధ్యమాలకు అండగా నిలుస్తున్న ప్రధానిని అభినందించాల్సింది పోయి విమర్శిస్తారేమిటి?’అంటూ ఆయన తిరిగి ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News