: శృంగారంలో ఉండగా చూశాడని విద్యార్థిని చంపేశారు
శృంగారంలో ఉండగా చూశాడని సాయికృష్ణ అనే ఐదవ తరగతి విద్యార్థిని హత్య చేసిన ఘటన నెల్లూరు జిల్లా కావలిలో శ్రీవిద్యానికేతన్ లో చోటుచేసుకుంది. శ్రీ విద్యానికేతన్ స్కూలు ప్రధానోపాధ్యాయుడు అయ్యన్నకు, అదే స్కూలులో పని చేస్తున్న కౌసల్యకు వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరూ స్కూలులో శృంగారంలో పాల్గొంటున్నప్పుడు సాయికృష్ణ చూశాడు. దీనిని బయట చెప్పకుండా ఉండేలా భయపెట్టాలని కౌసల్య, అయ్యన్నకు సూచించింది. దీంతో, హాస్టల్ లో ఉండే సాయికృష్ణను పిలిపించి భయపెట్టేందుకు చెంపపై కొట్టాడు. దెబ్బ బలంగా తగలడంతో సాయికృష్ణ తూలి పక్కనే ఉన్న కిచెన్ స్లాబుపై పడ్డాడు. తలకు బలమైన గాయమై మృతి చెందాడు. దీంతో, భయపడ్డ అయ్యన్న అనారోగ్యంతో సాయికృష్ణ మృతిచెందాడంటూ ఆసుపత్రికి తరలించి డ్రామాకు తెరదీశాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసిన పోలీసులు అన్ని విషయాలు వెలుగులోకి తెచ్చి, వారిద్దరినీ అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.