: మేకప్ ఖర్చులు... జపాన్ మహిళా మంత్రి రాజీనామాకు కారణమయ్యాయి!


జపాన్ మాజీ ప్రధాని కూతురు, ఆ దేశ ప్రస్తుత కేబినెట్ లో కీలక మంత్రిగానే కాక జపాన్ భావి ప్రధానిగా మన్ననలందుకుంటున్న యూకో ఒబుచి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. మేకప్ కోసం చేసిన ఖర్చులే ఒబుచిని రాజీనామా బాట పట్టించాయి. ముమ్మాటికి ఆ ఖర్చులే ఆమె రాజీనామాకు, తన తలనొప్పికి కారణమని జపాన్ ప్రధాని షింజో అబే చెబుతున్నారు. ఒబుచి రాజీనామాకు అబే ఆమోదం తెలిపారు. అసలు విషయమేంటంటే, జపాన్ లో రాజకీయ పార్టీలకు, నేతలకు పెద్ద ఎత్తున విరాళాలు అందుతాయి. వీటి వ్యయంపై పూర్తి స్థాయిలో ప్రభుత్వ నిఘా ఉంటుంది. ఈ నిధులను ఏమాత్రం దుర్వినియోగం చేసినా, సదరు రాజకీయ నేతలతో పాటు వారి పార్టీలు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. రాజకీయ విరాళాలను ఒబుచి ఎంచక్కా తన మేకప్ కోసం వినియోగించారు. సౌందర్య సాధనాలు, ఇతర సామగ్రి కోసం ఒబుచి ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ లో ఏకంగా రూ.58 లక్షల మేర ఖర్చు చేశారట. 2012లో ఖర్చైన ఈ నిధులన్నీ ఆమెకు రాజకీయ విరాళాల రూపేణా అందినవేనని తాజాగా ప్రభుత్వ పరిశీలనలో తేలింది. దీంతో, దేశానికి తొలి ప్రధానిగా రికార్డులకెక్కుతారనుకున్న ఒబుచి, అబే మంత్రి వర్గం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అబే కేబినెట్ లో పరిశ్రమలు, వాణిజ్యం, ఆర్థిక వ్యవహారాల మంత్రిగా ఆమె కీలక బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించారు.

  • Loading...

More Telugu News