: ఇక సోనియా అల్లుడు వాద్రా భూముల కొనుగోలు రద్దైనట్లే!


కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూముల కొనుగోలు దాదాపుగా రద్దయినట్టేనని వార్తలు వినవస్తున్నాయి. డీఎల్ఎఫ్ భూములను కారుచౌకగా చేజిక్కించుకున్న వాద్రాకు సదరు భూములను బదలాయిస్తూ ఎన్నికలకు ముందు హర్యానా సీఎం భూపిందర్ సింగ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. హర్యానా ఎన్నికల సందర్భంగా దీనిపై విమర్శలు గుప్పించిన ప్రధాని నరేంద్ర మోడీ ‘తాము అధికారంలోకి వస్తే, సదరు భూ వ్యవహారాన్ని రద్దు చేస్తామనే భయంతోనే భూపిందర్ సర్కారు హడావిడిగా ఆ క్రతువును పూర్తి చేసింది’ అని ఆరోపించారు. తాజాగా హర్యానా ఎన్నికల్లో బీజేపీ పూర్తి మెజార్టీ సాధించి, తొలిసారిగా పాలన పగ్గాలు చేపట్టనుంది. దీంతో, వాద్రా భూముల కొనుగోలు దాదాపుగా రద్దైనట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగాక, ఈ వివాదంలో చిక్కుకుని భూపిందర్ సర్కారు కోపాగ్నికి బలైన సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కాకు బీజేపీ సర్కారు కీలక పోస్టింగ్ ఇవ్వడం కూడా ఖాయమేనని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News